Dailyhunt
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు (Ranveer Singh) బిష్ణోయ్ గ్యాంగ్‌కు (Bishnoi Gang Threats) చెందిన వ్యక్తి నుంచి బెదిరింపులు ఎదురైనట్టు తెలుస్తోంది.

రూ.10 కోట్లు చెల్లించాలంటూ హారీ బాక్సర్ అనే వ్యక్తి వాయిస్ నోట్ పంపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు అమెరికా ఫోన్ నంబర్ నుంచి ఈ వాయిస్ మెసేజ్ అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలు కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.

ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. నిందితులను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్‌వీర్‌కు కూడా బెదిరింపులు ఎదురవడం కలకలానికి దారి తీసింది.

ఇక రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి గురువారం ముంబై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కాల్పులు జరిపిన దీపక్ శర్మ, సోనూ కుమార్, సన్నీ కుమార్‌లకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపారు. రూ.50 వేల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. నిందితులు దేశవాళి తుపాకీని వినియోగించారని పోలీసులు తెలిపారు. ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభమ్ లొంకర్‌కు ఈ ఉదంతంతోనూ సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy