Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ క్రమంలోనే అఫ్గానిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌, గుజరాత్ ప్లేయర్ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు.

శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 జాబితాలో ప్రవేశించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ స్టార్ లసిత్‌ మలింగ(170 వికెట్లు) రికార్డును అధిగమించాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌లో రషీద్‌ వికెట్ల సంఖ్య 173కు చేరింది.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో యుజ్వేంద్ర చాహల్‌ 229 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్‌ కుమార్‌ (215), సునీల్‌ నరైన్‌ (202), పియూశ్‌ చావ్లా (192), రవిచంద్రన్‌ అశ్విన్‌ (187), బుమ్రా (186), డ్వేన్‌ బ్రావో (183), రవీంద్ర జడేజా (178), అమిత్‌ మిశ్రా (174) ఉన్నారు. 10వ స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నాడు.

ఇక మ్యచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాయల్స్‌ బౌలర్లలో బ్రిజేష్‌ శర్మ 2, యశ్‌ రాజ్‌ పూనియా, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్‌ తడబడింది. రషీద్‌ ఖాన్‌ (4), జేసన్‌ హెల్డర్‌(3), రబాడ( 2), సిరాజ్‌ (1)ల ధాటికి 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆర్ఆర్ ఐదో స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు

  • యుజ్వేంద్ర చాహల్- 229

  • భువనేశ్వర్ కుమార్- 215

  • సునీల్ నారైన్ - 202

  • పియూష్ చావ్లా- 192

  • రవిచంద్రన్ అశ్విన్- 187

  • జస్ప్రీత్ బుమ్రా- 186

  • డిజె బ్రావో- 183

  • రవీంద్ర జడేజా- 178

  • అమిత్ మిశ్రా- 174

  • రషీద్ ఖాన్- 173


కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన సంజు శాంసన్

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy