Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌కు బోర్డు నుంచి పిలుపు!

రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌కు బోర్డు నుంచి పిలుపు!

స్పోర్ట్స్ డెస్క్: యూకే పర్యటనలో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ నిర్వహించాలనుకున్న సమీక్ష సమావేశానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఇంగ్లండ్ పర్యటన పూర్తైన వెంటనే ఈ సమావేశం జరగాల్సి ఉంది.

కానీ, జింబాబ్వే పర్యటన, శ్రీలంకలో టెస్ట్ సిరీస్‌ కారణంగా దీనిని వాయిదా వేశారు. అయితే రేపు(గురువారం) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరు కానున్నారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి వారికి పిలుపు వెళ్లిందని సమాచారం. ఇవాళ(బుధవారం) రాత్రికే వాళ్లు ముంబైకి చేరాలని సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన వైఫల్యంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలానే ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం, భవిష్యత్తులో జరిగే సిరీస్‌లకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీసీసీఐ సభ్యులతో టీమ్ మేనేజ్‌మెంట్ చర్చించనుంది.

త్వరలో జరగనున్న న్యూజిలాండ్‌ పర్యటన, స్వదేశంలో జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్, పురుషుల వన్డే ప్రపంచ కప్ 2027కు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికాలం పొడిగింపుపై సెప్టెంబర్ 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. అగార్కర్, గౌతమ్ గంభీర్ మధ్య మంచి రిలేషన్ ఉండటంతో అతని పదవికాలాన్ని పొగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

strong>

అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?

ఫేక్ ఇంజూరీ.. పాక్ ప్లేయర్ ఇమామ్‌పై పీసీబీ విచారణకు ఆదేశం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy