ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని 8 జిల్లాల్లో ఈరోజు (గురువారం) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భద్రాద్రి, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణలో చెదురుమదురు వానలు పడే అవకాశమున్నట్టు తెలిపారు.
కాగా.. రాష్ట్రంలో ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పారు.
ఇవీ చదవండి:

