Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిటైర్‌మెంట్ గురించి నన్నెవరూ ఒత్తిడి చేయలేదు.. స్టోక్స్ క్లారిటీ

రిటైర్‌మెంట్ గురించి నన్నెవరూ ఒత్తిడి చేయలేదు.. స్టోక్స్ క్లారిటీ

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ సోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు అతడి కెరీర్‌లో చివరిదని వెల్లడించాడు.

అయితే స్టోక్స్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నైట్‌క్లబ్ వివాదం నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రిటైర్‌మెంట్ ప్రకటించాలని స్టోక్స్‌పై ఒత్తిడి తెచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై స్టోక్స్ స్పందించాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని.. ఎవరూ తనను రిటైర్‌మెంట్ ఇవ్వాలని బలవంతం చేయలేదని స్టోక్స్ స్పష్టం చేశాడు.

'ఈ నిర్ణయం నేను ఒక్కసారిగా తీసుకున్నది కాదు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1 తేడతో ఓడింది. అప్పటి నుంచే మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. తిరిగి కోలుకోవడానికి ఎంతో ప్రయత్నించా. కానీ ఫలితం రాలేదు. నన్ను నేను పూర్తిగా అలసిపోయేలా చేసుకున్నా. నైట్‌క్లబ్ వివాదం నాపై ప్రభావం చూపింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న సమయంలో నేను మానసికంగా ఎంతగా అలసిపోయానో అర్థమైంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. కానీ గత రెండు వారాలు చాలా కఠినంగా గడిచాయి' అని స్టోక్స్ వెల్లడించాడు.

జట్టుకు మేలు జరుగుతుంది..

నైట్‌క్లబ్ వివాదం తర్వాత న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు స్టోక్స్‌పై వేటు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడు కౌంటీ జట్టు డర్హమ్ తరఫున ఆడాడు. 'అక్కడ క్రికెట్‌ను ఆస్వాదించగలిగాను. కానీ అంతర్జాతీయ స్థాయికి తిరిగి వచ్చిన తర్వాత ఆ అనుభూతిని పొందలేకపోయాను. అయితే నా రిటైర్‌మెంట్ నిర్ణయంలో కొంత నా స్వార్థం కూడా ఉంది. భవిష్యత్తులో జట్టుకు ఇది మేలు చేస్తుందని ఆశిస్తున్నా. నా జీవితంలో ఎంతో ఇచ్చిన క్రికెట్‌పై ప్రేమ కోల్పోకుండా ఉండాలంటే రిటైర్‌మెంట్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని భావించా' అని స్టోక్స్ తెలిపాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy