Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

నకాపల్లి, జూన్ 17: ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సపర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

రెండేళ్ల ఎన్డీయే పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు ఈరోజు(బుధవారం) ఉదయం నక్కపల్లిలోని తన నివాసం నుంచి అనకాపల్లికి అనిత బయలుదేరారు. మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి బాధితులకు సహాయం అందించారు.

ఎలమంచిలి సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురికావడంతో ఓ యువతి, యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న వారిని చూసిన హోంమంత్రి అనిత చలించిపోయారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలైన వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి అనిత.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితుల పట్ల హోంమంత్రి అనిత చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

.

వయస్సు 60...ర్యాంకు 9

దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు

Read Latest AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy