Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు తక్కువ ధరలో లభించే అత్యంత పోషకవంతమైన ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రొటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లను ఉడికించి తిన్నా, ఇతర రూపాల్లో తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం, ఒక గుడ్డులో సుమారు 6 నుంచి 7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, అలాగే విటమిన్ A, B12, B6, D, E, ఫోలేట్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ల్యూటిన్, జీక్సాంథిన్, అలాగే మెదడు పనితీరుకు అవసరమైన కోలిన్ కూడా గుడ్లలో లభిస్తాయి.

గుడ్లు గుండె ఆరోగ్యానికి మంచివేనా?

గుడ్లు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు వారానికి ఏడు గుడ్ల వరకు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు గుడ్లు తీసుకోవడం మంచిది.

ప్రొటీన్‌కు మంచి మూలం

గుడ్లు సంపూర్ణ ప్రొటీన్‌ కలిగిన ఆహారం. శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. చాలామంది ప్రొటీన్ కేవలం గుడ్డులోని తెల్లసొనలోనే ఉంటుందని అనుకుంటారు. కానీ గుడ్డులోని మొత్తం ప్రొటీన్‌లో దాదాపు సగం పచ్చసొన నుంచే లభిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం

గుడ్లు పోషకాలతో నిండిన ఆహారం. ఆరోగ్యంగా ఉన్నవారు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ తినలేని వారు వారానికి 5 గుడ్లు వరకు తీసుకోవచ్చు. అయితే మధుమేహం, గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తమ ఆహారంలో గుడ్ల పరిమాణం గురించి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy