Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..

రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని సూరత్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు భావించారు.

అయితే ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టిన ఘటనగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం రూ.10 వేల జీతం బకాయి విషయంలో మాజీ ఉద్యోగి చేసిన చర్యతో సుమారు రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు (Surat Textile Market Fire).

ఈ కేసులో 33 ఏళ్ల వినోద్ పండిట్ సావ్లేను క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. సూరత్‌లోని సరొలి ప్రాంతంలోని శ్యామ్ సంగిని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 9న భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని ఆరో అంతస్తులో మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. భారీగా నిల్వ ఉంచిన వస్త్రాలు కాలిపోయాయి. ఈ మార్కెట్‌లోని ఓ దుకాణంలో వినోద్ పండిట్ సావ్లే అకౌంటెంట్‌గా పనిచేశాడు. ఏప్రిల్ 2026లో ఉద్యోగంలో చేరిన అతడు సుమారు మూడు నెలలు పనిచేసిన తర్వాత జూన్‌లో ఉద్యోగం వదిలేశాడు. తనకు సుమారు రూ.10 వేల జీతం బకాయి ఉంది (Rs 24 Crore Loss).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి మార్కెట్‌లోకి వినోద్ వెళ్లాడు. మార్కెట్ ఖాళీ అయ్యే వరకు వేచి ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తాను గతంలో పని చేసిన దుకాణం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వస్త్రాల పార్సిళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా వస్త్రాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి ముఖానికి వస్త్రం కప్పుకుని మార్కెట్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. చివరకు అతడు వినోద్ అని గుర్తించారు (Rs 10000 Salary Dispute).

తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న వినోద్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సూరత్ నుంచి పరారయ్యాడు (Textile Market Fire). ముందుగా రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్‌కు, ఆ తర్వాత అయోధ్యకు వెళ్లాడు. తిరిగి సూరత్‌కు వచ్చిన సమయంలో పోలీసులకు దొరికిపోయాడు. కాగా, వినోద్ పగతో చేసిన పని వల్ల దాదాపు రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు కాలి బూడిదయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy