Dailyhunt
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

మరావతి, ఏప్రిల్ 26: అనంతపురం జిల్లా రుద్రంపేటలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆరా తీశారు.

ఆదివారం జిల్లా ఉన్నతాధికారులకు ఆమె ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని వారిని ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబాన్ని ఉన్నతాధికారులు పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి వారు హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి వారు భరోసా కల్పించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని ప్రకటించారు.

రుద్రంపేటలో ఆరేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై రాజకీయ పార్టీకి చెందిన నేత అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిపై దాడి చేశారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అతడిని అప్పగించారు. అయితే నిందితుడిపై ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుడు వైసీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేసేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించకుండా.. అతడికి మతిస్థిమితం లేదంటూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.

జనగణన వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు: మంత్రి కిషన్ రెడ్డి

ఉపాధితో మారుతున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం: వీఏంఆర్‌డీఏ చైర్మన్

For More AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy