డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రూపాయి విలువ ఓవర్ వాల్యూగా ఉందని చెప్పలేమని, అయితే వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని మాత్రం చెప్పగలమని అన్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం మొదలైన కారణాలతో ఇటీవల రూపాయి విలువ భారీగా పతనమైంది.
రూపాయికి ఒక నిర్దిష్ట విలువను లక్ష్యంగా పెట్టుకోవడం కంటే, కరెన్సీ మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికే ఆర్బీఐ ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. రూపాయి విలువకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయినీ ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదని అన్నారు. అలాంటి విషయాల్లో కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఫారెక్స్ మార్కెట్‌లో అసాధారణ అస్థిరత లేదా ఊహాగానాలను అరికట్టేందుకు మాత్రమే కేంద్ర బ్యాంక్ జోక్యం చేసుకుంటుందని తెలిపారు (Rupee undervalued).
ఇక సోమవారం రూపాయి రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది (Rupee dollar rate). ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.20గా ఉంది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ఆశలు పెరగడంతో పాటు చమురు ధరలు తగ్గడం ఇందుకు కారణాలుగా కనబడుతున్నాయి. కాగా, ఇరాన్ యుద్ధం మొదలైన ఫిబ్రవరి చివరి నుంచి రూపాయి దాదాపు 6% మేర రూపాయి బలహీనపడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

