Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు

సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. వంటగ్యాస్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచడంతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్‌పై ఒకేసారి రూ.29 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ సవరించిన ధరలు నేటి నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ తాజా ధరల పెరుగుదల ప్రభావం దేశంలోని అన్ని ప్రధాన నగరాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పటివరకు రూ.913 ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.942లకు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ముఖ్యంగా హైదరాబాద్‌లో సిలిండర్ ధర వెయ్యి రూపాయల మార్కుకు చేరువవుతోంది. నిన్నటివరకు భాగ్యనగరంలో రూ.965 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, తాజా పెంపుతో రూ.994లకు పెరిగింది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే రెండోసారి వంటగ్యాస్ ధరలు పెరగడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy