Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాకింగ్ వీడియో.. బాల్కనీలో నిలబడి ఐస్‌క్రీమ్ అందుకుంటుండగా..

షాకింగ్ వీడియో.. బాల్కనీలో నిలబడి ఐస్‌క్రీమ్ అందుకుంటుండగా..

ఇంటర్నెట్ డెస్క్: బాల్కనీలో నిలబడ్డ ఒక వ్యక్తి రోడ్డుపై ఉన్న వ్యాపారి నుంచి ఐస్‌క్రీమ్ అందుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితుడికి గాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. సోన్‌భద్ర జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, బాధితుడు ఒక భవనంలోని మొదటి అంతస్తులో ఉంటున్నారు. తన ఇంటి ముందుకు వచ్చిన ఐస్‌క్రీమ్ బండి నుంచి ఒక ఐస్‌క్రీమ్ కొనుగోలు చేశారు. అయితే, బాల్కనీలో నిలబడ్డ ఆయన ఐస్‌క్రీమ్‌ను తన చేతికందివ్వమని వ్యాపారిని అడిగారు. ఆయన ముందుకు వంగి ఐస్‌క్రీమ్ అందుకునే సమయంలో బ్యాలెన్స్ తప్పి నేరుగా కిందపడిపోయారు. దీంతో, కుటుంబసభ్యులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రిల్స్ లేని బాల్కనీలో నిలబడ్డప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy