Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత

శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన భారత ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.

విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్ రికార్డు నమోదు చేశాడు. ధోని 2,496 పరుగులు చేయగా.. పంత్ 2500 పరుగుల మైలురాయిని దాటేశాడు.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 81 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కెరీర్‌లో ఇది అతడికి 21వది. మరో ప్లేయర్ ధ్రువ్‌ జురెల్ కూడా అర్ధ శతకం చేశాడు. 99 బంతుల్లో తన మూడో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం కూడా సెంచరీ దాటేసింది. లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 112 ఓవర్లకు 419/6. క్రీజ్‌లో పంత్‌ (63*), ధ్రువ్ జురెల్ (59*) ఉన్నారు.

విదేశీగడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు

  • రిషబ్ పంత్-2501*

  • ఎంఎస్ ధోని-2496

  • ఫరోఖ్ ఇంజనీర్-1209

  • సయ్యద్ కిర్మానీ-1109

  • కిరణ్ మోర్-901

strong>

ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్

కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy