Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊరట లభించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ స్పష్టం చేశాడు.

శుక్రవారం ప్రాక్టీస్‌ సమయంలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతి గిల్‌ కుడి మోచేతికి బలంగా తగిలింది. మైదానంలోనే దాదాపు 20 నిమిషాల పాటు చికిత్స తీసుకున్న గిల్‌.. ఆ తర్వాత నెట్స్‌లో త్రోడౌన్స్‌ ఎదుర్కొన్నాడు. దీంతో వెస్టిండీస్‌తో ఆదివారం జరగనున్న తొలి వన్డేకు గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న గందరగోళంగా మారింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. 'గిల్‌ బాగానే ఉన్నాడు. మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని వెల్లడించాడు.

ఇక జట్టులో చోటు కోసం నెలకొన్న తీవ్ర పోటీపై కూడా కోటక్‌ స్పందించాడు. ప్రతిభావంతుడైన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు వరుసగా తుది జట్టులో చోటు దక్కకపోవడంపై ప్రశ్నించగా.. జట్టులో ఉన్న పోటీ కారణంగానే అతడు బెంచ్‌కే పరిమితమవుతున్నాడని వివరించాడు. 'జట్టులో చాలా మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. అందుకే పోటీ తీవ్రంగా ఉంది. జైస్వాల్‌ ఎంతటి ప్రతిభావంతుడో మనందరికీ తెలుసు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తనను తాను నిరూపించుకున్నాడు. యశస్వి నైపుణ్యం, ప్రాక్టీస్‌, మానసిక స్థితిపై మేం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నాం. గౌతమ్‌ గంభీర్‌ కూడా అతడితో మాట్లాడుతుంటాడు.

'ఒక జట్టులో ముగ్గురు మంచి వికెట్‌కీపర్లు ఉంటే.. వారిలో ఒక్కరే ఆడతారు. అంతమాత్రాన మిగతా ఇద్దరికి అన్యాయం జరిగిందని చెప్పలేం. ఇది ఆటలో భాగం. జైస్వాల్‌ కష్టపడి పనిచేస్తూ తన అవకాశాల కోసం వేచి ఉండాలి. ఇప్పటివరకు జట్టుకు అవసరమైనప్పుడు అవకాశం లభిస్తే అతడు అద్భుతంగా ఆడాడు' అని కోటక్‌ పేర్కొన్నాడు.

జడేజా అత్యుత్తమ ఫీల్డర్..

వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విషయంలోనూ కోటక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా క్రీడల కోసం అక్షర్‌ పటేల్‌ టీ20 జట్టుతో ఉండటంతో.. వన్డే జట్టులో జడేజా పాత్రపై ప్రశ్నలు వచ్చాయి. 'జడేజా కచ్చితంగా జట్టు ప్రణాళికల్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అక్షర్‌కు విశ్రాంతి ఇచ్చినప్పుడు జడేజా ఆడాడు. ఆ తర్వాత ఏం ఆలోచిస్తున్నారో సెలక్షన్‌ కమిటీనే చెప్పాలి. నేను సెలక్షన్‌ ప్యానెల్‌లో లేను. భారత్‌ తరఫున ఆడుతున్న ప్రతి ఆటగాడు జట్టులోని 20-25 మంది ఆటగాళ్లలో ఒకడు. జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్‌. అతడి రికార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడు బౌలింగ్‌ చేయగలడు, బ్యాటింగ్‌ చేయగలడు. అతడికి ఉన్న అనుభవం ఎంతో విలువైనది. అనుభవాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రోహిత్‌, విరాట్‌, జడేజా.. ముగ్గురూ జట్టుకు తమ అనుభవంతో ఎంతో విలువను తీసుకొస్తారు. అందుకే జడేజా ఇప్పటికీ టీమిండియాకు ఎంతో ఉపయోగకరమైన ఆటగాడు' అని కోటక్‌ వెల్లడించాడు.

strong>

ఆసియా క్రీడలు: డబుల్ బొనాంజా.. కబడ్డీలో భారత్‌కు మరో స్వర్ణం

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy