Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కీలక నేతలతో రేవంత్‌రెడ్డి..

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కీలక నేతలతో రేవంత్‌రెడ్డి..

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నేతలతో భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో తెలిపారు.

తెలంగాణ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే సీడబ్ల్యూసీ సమావేశంలో దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, ఎన్నికల జాబితాల అంశంతో పాటు దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపైనా చర్చించే అవకాశం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.

'ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు'.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

'పార్టీ వైఫల్యాన్ని కేసీఆర్‌పై మోపుతున్నావ్‌.. నాతో పెట్టుకోకు'.. కేటీఆర్‌పై కవిత ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy