Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

ప్రస్తుతం దొంగలు ఎంత తెలివిమీరిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొందరు టెక్నాలజీని వాడుకుని కాలు కదపకుండా చోరీలు చేస్తుంటే.. మరికొందరు ఇళ్లలోకి ఎంతో తెలివిగా చొరబడి దొంగతనాలు చేస్తున్నారు.

ఇంకొందరు చేసే చోరీలైతే.. సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. ఇలాంటి చోరీలు చూసినప్పుడు.. వామ్మో.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్రమైన చోరీలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా ఈ తరహా షాకింగ్ చోరీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో కొందరు దొంగలు 105 కిలోల చికెన్‌ను ఎత్తుకెళ్లిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ చోరీ వీడియో (theft Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఈజిప్టులో (Egypt) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చికెన్ లోడుతో ఉన్న ట్రక్కు వేగంగా వెళ్తోంది. దానిపై కన్నేసిన కొందరు దొంగలు.. వెంటనే తమ కారుతో ఆ ట్రక్కును ఛేజ్ చేశారు. చూస్తుండగానే ట్రక్కు సమీపానికి వెళ్లారు. కారును ట్రక్కుకు సమీపంగా ఉంచి.. అదే వేగాన్ని కొనసాగిస్తూ చోరీ స్టార్ట్ చేశారు. డ్రైవర్ కారు నడుపుతుండగా.. మిగతా వారు కారు పైనుంచి ట్రక్కు వెనుక వైపు డోర్లు తెరిచి, లోపల ఉన్న చికెన్ బ్యాగులను కారులోకి మార్చేశారు.

ఇలా చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కారులోని 105కిలోలకు (105 kg chicken) పైగా చికెన్‌ను తమ కారులోకి మార్చేశారు. ఈ చోరీ మొత్తం వాహనాలు అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలోనే జరిగింది. ఈ క్రమంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ ఆ దొంగలు మాత్రం ఎంతో చాకచక్యంగా చోరీ చేసేశారు. ఇంత జరుగుతున్నా కూడా ట్రక్కు డ్రైవర్‌కు ఏమాత్రం అనుమానం రాలేదు. ఈ చోరీని చూసిన మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. కొందరు తమ ఫోన్లలో ఈ ఘటనను రికార్డ్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'వామ్మో వీళ్ల చోరీ మామూలుగా లేదుగా'.. అంటూ కొందరు, 'ఇలాంటి చోరీని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు'.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లను, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy