Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్ ఫోన్ వాడటం మానేశాడు.. జీవితం అద్భుతంగా మారిపోయింది..

స్మార్ట్ ఫోన్ వాడటం మానేశాడు.. జీవితం అద్భుతంగా మారిపోయింది..

ఇంటర్‌నెట్ డెస్క్: నేడు చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు సెల్‌ఫోన్ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారు.

భారత్‌లో 70 శాతం మంది రోజులో కనీసం 5 గంటలు సెల్‌ఫోన్ వాడుతున్నారని పలు సర్వేల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల శారీరకంగా, మానసికంగా మనుషులు ఎన్నో నష్టాలకు గురవుతున్నారు. అయినా కూడా ఫోన్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం స్మార్ట్ ఫోన్ కారణంగా జీవితం పాడవుతోందని గ్రహించి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్మార్ట్ ఫోన్ వాడకం మానేశాడు. స్మార్ట్ ఫోన్ నుంచి ఫ్లిప్ ఫోన్‌కు మారాడు. దీంతో అతడి జీవితంలో పెను మార్పులు వచ్చాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన నాథన్ కోవే స్మార్ట్‌ ఫోన్‌కు బానిస అయ్యాడు. గంటలు గంటలు ఫోన్ వాడుతూ గడిపేవాడు. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కారణంగా తనను తాను మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. స్మార్ట్ ఫోన్ అంటే అసహ్యం వేసింది. దీంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. స్మార్ట్ ఫోన్‌కు గుడ్‌బై చెప్పి.. ఫ్లిప్ ఫోన్ వాడటం మొదలెట్టాడు. ఆ ఫోన్‌లో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవు. ఆ ఫోన్ వాడటం మొదలుపెట్టిన తర్వాత అతడి జీవితంలో మార్పు మొదలైంది.

గంటలు గంటలు ఫోన్ వాడటం తగ్గింది. తనతో తాను గడపడానికి సమయం దొరికింది. మానసిక ప్రశాంతత లభించింది. నెల రోజుల్లో నాథన్ ఓ కొత్త మనిషిగా మారిపోయాడు. తన నెల రోజుల అనుభవంపై ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. స్మార్ట్‌ ఫోన్ వాడటం మానేసిన తర్వాత తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని ఆ పోస్టులో చెప్పుకొచ్చాడు. నాథన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy