Dailyhunt
స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

'పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..?' అంటూ వచ్చే స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి.

ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడో, బైక్‌పై వెళ్లేటప్పుడో ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తే మరింత చిర్రెత్తుతుంది. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా, మరో కొత్త నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన రూల్స్ తీసుకొచ్చింది (TRAI spam control app).

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ 'డూ నాట్ డిస్ట్రబ్' (DND) యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో నంబర్‌ను నమోదు చేసుకుంటే స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉంటాయని ట్రాయ్ తెలిపింది. ఈ యాప్‌లో వినియోగదారులు చాలా సులభంగా తమ నంబర్‌లను నమోదు చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు (DND India guide).

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఇలా నియంత్రించండి..

  • మీ ఫోన్‌లో ట్రాయ్ డీఎన్‌డీ (TRAI DND) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

  • యాప్ ఓపెన్ చేసి మీరు స్వీకరించాలనుకుంటున్న లేదా పరిమితం చేయాలనుకుంటున్న కమ్యూనికేషన్ వర్గాలను ఎంచుకోండి

  • ఓటీపీ ద్వారా వేగంగా యాక్టివేషన్ చేసుకోండి

  • ఫిర్యాదుల సెక్షన్‌లోకి వెళ్లి స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు

  • మీ ఫిర్యాదును యాప్‌లోనే ట్రాక్ చేయవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy