Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

నంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

జిల్లాలో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో ఆయా వర్గాల టీడీపీ, వైసీపీ నేతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా శాంతి, భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు కేతిరెడ్డిని గృహనిర్భంధం చేశారు.

తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామని వైసీపీ నేతలు ప్రకటించగా.. దీనిని అడ్డుకుంటామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనంతపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని జేసీ వర్గీయులు ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మొహరం వేడుకలు, వీవీఐపీల పర్యటన నేపథ్యంలో తగిన భద్రతా బలగాలను కేటాయించడం సాధ్యం కాదని పేర్కొంటూ ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ప్రజా శాంతి, భద్రతకు సహకరించాలని కోరుతూ టీడీపీ, వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

ఈ మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేసి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా అన్ని చర్యలు చేపట్టారు. తాడిపత్రిలోని గాంధీ సర్కిల్‌తో పాటు ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

strong>

ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తజనం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy