Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'టైమ్స్ స్క్వేర్'లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి

'టైమ్స్ స్క్వేర్'లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్‌ పియాసెంటిగా అధికారులు గుర్తించారు.

మంగళవారం ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. క్వీన్స్‌కు చెందిన ఓ 49 ఏళ్ల మహిళ టైమ్స్‌ స్క్వేర్ వద్దకు రెండు కత్తులతో వచ్చి అక్కడున్న ఎరిన్‌తో పాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనలో ఎరిన్ కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బ్యాంకింగ్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఎరిన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. ఇంతలో అనూహ్యంగా ఆమె మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎరిన్ మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు అన్న విషయం తెలిసిందే.

కత్తులతో దాడికి పాల్పడ్డ మహిళ కూడా పోలీసు కాల్పుల్లో కన్నుమూసింది. ఆమెను పామెలా సిస్నెరోస్‌గా (49) పోలీసులు గుర్తించారు. పామెలాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఓసారి ఆమెపై ఫిర్యాదు వచ్చినా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. పామెలా దశాబ్దాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె సోదరుడు చెప్పాడు. అయితే, ఇప్పటివరకూ ఏనాడు ఆమె హింసాత్మక ధోరణి కనబరచలేదని అన్నాడు.

ఈ వార్తలనూ చదవండి:

నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy