Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో భాషా, సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి.

జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది (Tamil Thaai Vazhthu).

తీర్మానం ప్రకారం తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను ఆలపించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, సీపీఐ, బీజేపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల సభ్యులు తీర్మానానికి మద్దతు తెలిపారు. అనంతరం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది (Tamil anthem).

'తమిళ్ తాయ్ వాళ్తు' విషయంలో తమిళనాడులో రాజకీయ వివాదం కొనసాగుతోంది (Tamil Nadu politics). ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా వందే మాతరం, జాతీయ గీతం తర్వాత 'తమిళ్ తాయ్ వాళ్తు'ను ఆలపించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గతంలోలాగానే ముందుగా 'తమిళ్ తాయ్ వాళ్తు' గీతాన్ని ఆలపించాలనే డిమాండ్ మరింత బలపడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తాజాగా ఆమోదించిన తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు

అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy