Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసులో కీలక మలుపు

తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసులో కీలక మలుపు

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌, ఆయన భార్య సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత ఉపసంహరించుకున్నారు.

దీంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు ఈ కేసును ముగించింది. విచారణ సందర్భంగా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై, తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది.

కాగా, గత కొంతకాలంగా విజయ్-సంగీత విడాకుల వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల సమయంలో దళపతి విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో 2026 ఫిబ్రవరి 24న విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొంటూ ఆయన నుంచి విడిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే, తాజాగా ఆమె ఆ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో డివోర్స్ కేసును చెంగల్పట్టు కోర్టు క్లోజ్ చేసింది. సంగీత పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారు? అనే కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే, ఈ కేసు ముగియడం సీఎం విజయ్‌కు ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతాన్ని ఎందుకు మూసివేయకూడదు: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న..

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy