Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో కొత్త వివాదం! అబార్షన్ హక్కు వ్యతిరేక ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్

తమిళనాడులో కొత్త వివాదం! అబార్షన్ హక్కు వ్యతిరేక ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ తీరు మహిళా హక్కులకు వ్యతిరేకమంటూ రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

చెన్నైలో ఆగస్టు 8,9 తేదీల్లో మార్చ్ ఫర్ లైఫ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. మద్రాస్-మైలాపోర్ ఆర్చిడయోసీస్ ఆధ్వర్యంలో స్టెల్లా మేరీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పసి ప్రాణాలను మొగ్గులోనే చిదిమేసే అబార్షన్‌లను సభలో అనేక మంది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎమ్‌టీపీ యాక్ట్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా గర్భధారణతోనే ఓ కొత్త జీవి ప్రాణం పోసుకుంటుందన్న అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. 'గర్భస్థ శిశువుకు కూడా గౌరవం ఉంటుంది. ఈ భావాన్ని వ్యక్తీకరించే వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పిల్లలు అందరూ దేవుడి దీవెనలే. ఈ దీవెనను వ్యతిరేకించే ఆలోచన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు' అని స్పీకర్ అన్నారు.

ఈ కామెంట్స్‌పై రాష్ట్రంలో పలువురు మహిళా హక్కుల కార్యకర్తల విమర్శలు గుప్పించారు. గర్భధారణకు సంబంధించి మహిళల హక్కులకు ప్రాధాన్యమిస్తూ 2021లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనేక మంది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 21 ప్రకారం సేఫ్ అబార్షన్ కూడా ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అసెంబ్లీ స్పీకర్ ఎలా పాల్గొంటారని, స్పీకర్ వాదనతో సీఎం కూడా ఏకీభవిస్తున్నారా? అని షాలిన్ మారియా లారెన్స్ అనే మహిళా హక్కుల కార్యకర్త ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy