హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. రాష్ట్రంలో 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) హెచ్‌ఐసీసీలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రపోజల్స్ రూపొందించామని.. రెండు గంటల సమయం వెచ్చించి స్పెషల్ రివ్యూ చేయాలని ప్రధాని మోదీని కోరారు.

