Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీ20ల్లో ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

టీ20ల్లో ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్‌ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఈ మైలురాయిని అందుకుంది. న్యూజిలాండ్‌ మాజీ స్టార్ సుజీ బేట్స్‌ను అధిగమించి ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుజీ బేట్స్‌ (4,758 పరుగులు) పేరిట ఉండేది. అయితే బంగ్లాపై 37 పరుగులు చేసిన స్మృతి.. 4,765 పరుగులు నమోదు చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(4,287 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతోంది.

span>

ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy