Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్ నియామకం

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్ నియామకం

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం పూర్తవడంతో టి.దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన స్థానాన్ని శుభదీప్ భర్తీ చేయనున్నారు. ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనతో శుభదీప్ బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో కలిసి శుభదీప్ పనిచేయనున్నారు. వివిధ వయో విభాగాల భారత జట్లతో పనిచేసి మంచి గుర్తింపు పొందిన ఆయన నియామకంపై అసోం క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

ఇక టి.దిలీప్ 2021 నుంచి 2026 వరకు దాదాపు ఐదేళ్లపాటు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంలో చేరిన ఆయన, 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా 'బెస్ట్ ఫీల్డింగ్ మెడల్' సంప్రదాయాన్ని ప్రారంభించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం సహాయక సిబ్బంది మారినా, గంభీర్ బృందంలో కొనసాగిన ఏకైక సభ్యుడు దిలీప్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయన ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించినా, ఈసారి మాత్రం పునరుద్ధరించలేదు.

మరోవైపు సహాయ కోచ్ ర్యాన్ టెన్ కూడా ఇటీవల జట్టుకు వీడ్కోలు పలికారు. ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు ఆశించినప్పటికీ టి.దిలీప్ కొనసాగడంతో సహాయ కోచ్ బాధ్యతలకే పరిమితమైన ఆయన, భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన అనంతరం తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

strong>

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy