Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

స్పోర్ట్ డెస్క్: టీమిండియా ఓపెనర్, టీ20 ప్రపంచ కప్2026 విన్నింగ్ స్టార్ సంజూ శాంసన్ ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు దూరమైన సంజూకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

ఆసియా క్రీడల జట్టులోనూ అతడు స్థానం కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో టీమిండియా సెలక్టెర్లు 15 మంది సభ్యులతో ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించారు.

ఆసియా క్రీడల కోసం ప్రకటించిన ఆ జట్టులో ఇషాన్ కిషన్‌తో పాటు మరో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రీడావర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐర్లాండ్ సిరీస్, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మూడు మ్యాచుల్లో కేవలం 6 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశిని తుది జట్టులోకి తీసుకుంది. అంతేకాక జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. దీంతో విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు సంజూను తప్పించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

జింబాబ్వే సిరీస్‌కు సంజూ స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఇక ఏషియన్ గేమ్స్ విషయానికి వస్తే.. ఈ క్రీడలు ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. మొత్తంగా యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్‌కు పుట్‌స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ

ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy