తిరుపతి: తిరుమలలో భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక పుష్ప ప్రదర్శనశాల ప్రారంభించారు. కల్యాణ వేదికలో సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
వివిధ రకాల పూలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు, థీమ్స్ సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ఈ పుష్ప ప్రదర్శనశాలలో మొత్తం 18 రకాల పుష్పాలను ఉపయోగించి 72 వేల పూలతో వివిధ అలంకరణలు చేశారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక థీమ్స్‌ను రూపొందించారు.

నాలుగు యుగాలకు సంబంధించిన అంశాలను పుష్పాలతో అందంగా ఆవిష్కరించారు. వీటితో పాటు మొత్తం 14 రకాల థీమ్స్‌తో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ప్రతి థీమ్‌లోనూ పూలను వినూత్నంగా ఉపయోగించి ఆకర్షణీయమైన రూపాలను తీర్చిదిద్దారు.
హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే ఆ ఛానల్ పరిస్థితి: మంత్రి అచ్చెన్న

