Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ఇంటర్నెట్ డెస్క్: తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ భారీ స్కోర్ చేసింది.

నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియాకు 296 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(101) సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ జాన్ కాంబెల్(62) హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మ్యాచ్ ఆరంభంలో వికెట్లు తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. 19.2 ఓవర్లో విండీస్ తొలి వికెట్ పడిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అమిర్ జాంగో(58*) అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కార్టీ(13), హోప్(12), ఆండ్రూ(0), రోస్టన్ ఛేస్(24), మ్యాథ్యూ ఫోర్ట్(7) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2, నితీశ్ కుమార్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.

strong>

ఆసియా క్రీడలు: డబుల్ ధమాకా.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

వృద్ధాశ్రమంలో వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy