Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా?

వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: దాహం వేసినప్పుడు మనం సాధారణంగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆ బాటిళ్లకు ఉండే మూతలు నీలం, తెలుపు, ఆకుపచ్చ వంటి వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ రంగుల వెనుక కొన్ని ప్రత్యేక సూచనలు ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో తెలుస్తోంది.

మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువుల గురించి పెద్దగా ఆలోచించం. వాటర్ బాటిల్ కూడా అలాంటి వాటిలో ఒకటి. ఎక్కువగా మార్కెట్లో కనిపించే బాటిళ్లకు నీలం రంగు మూత ఉంటుంది. అయితే కొన్ని బాటిళ్లకు తెలుపు, ఆకుపచ్చ లేదా ఇతర రంగుల మూతలు కూడా కనిపిస్తాయి. మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నారు.


  • నీలం రంగు మూత - రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్

  • తెలుపు రంగు మూత - ప్యూరిఫైడ్ వాటర్

  • ఆకుపచ్చ రంగు మూత - మినరల్ వాటర్

  • నలుపు రంగు మూత - ఆల్కలైన్ వాటర్

  • పసుపు రంగు మూత - విటమిన్లు అధికంగా ఉన్న నీరు

  • ఎరుపు రంగు మూత - ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉన్న నీరు

ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అన్ని కంపెనీలు ఒకే రంగు ప్రమాణాలను అనుసరిస్తాయనే అధికారిక నిబంధన లేదు. కాబట్టి బాటిల్ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ఉన్న వివరాలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

సక్సెస్ కోసం సంతకం ఇలా చేయండి!

ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy