Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న యువకుడిని ఓ కుటుంబం కాపాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో ఓ బైకర్ చిక్కుకుపోయాడు.

అటుగా వెళ్తున్న ఓ కుటుంబం అత్యంత సాహసోపేతంగా ఆ యువకుడిని కాపాడేందుకు ముందుకొచ్చింది. తమ ప్రాణాలకు తెగించి మరీ అతడిని సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

భటియత్ జిల్లా భర్మాలా ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెద్దఎత్తున కురిసిన వానకు వరదనీరు పోటెత్తింది. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా పెద్ద ఏరులా మారిపోయింది. కకియారా-తునుహట్టి రహదారిపైకి కూడా వరదనీరు దూసుకొచ్చింది. ఇదే సమయంలో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న మమ్లా గ్రామానికి చెందిన ఓ బైకర్ వరదనీటిలో చిక్కుకుపోయాడు. ప్రవాహం ఉధృతికి ద్విచక్రవాహనంతో సహా అతను కొంతదూరం కొట్టుకుపోయాడు. అనంతరం రోడ్డుపక్కన ఉన్న ఓ చెట్టును పట్టుకుని వరదనీటిలో కొట్టుకుపోకుండా బలంగా నిలబడిపోయాడు. అదే రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం బైకర్‌ను కాపాడేందుకు ముందుకొచ్చింది.

కారులో ఉన్న ఓ యువకుడు, ఇద్దరు మహిళలు తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ ముందుకొచ్చారు. బైకర్ సమీపానికి తమ వాహనాన్ని తీసుకెళ్లి ఆపారు. అనంతరం కారు డోర్లు తెరిచిన యువకుడు వరదనీటిలో నిలుచోగా.. తమ చున్నీలను తాడుగా కట్టిన మహిళలు ఆ యువకుడి సాయంతో బైకర్ వైపుగా విసిరారు. చివరికి బాధితుడు తాడును పట్టుకోగా.. సురక్షితంగా అతడిని ఒడ్డుకు చేర్చారు. ఆ కుటుంబం సమయస్ఫూర్తి, ధైర్యం ఓ ప్రాణాన్ని నిలబెట్టడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపదలో ఉన్న అపరిచిత వ్యక్తిని కాపాడిన ఆ కుటుంబంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్

నీట్‌ కేసులు రద్దు చేయండి.. సుప్రీంకోర్టును కోరిన 4 రాష్ట్రాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy