Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..

వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..

క్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వణికించాయి. శక్తిమంతమైన ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి.

ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు దెబ్బతినగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు (Venezuela earthquake 2026).

అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) ప్రకారం, మొదట 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, కొద్ది నిమిషాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో శక్తిమంతమైన భూకంపం నమోదైంది. కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో,13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపాల కారణంగా పలు భవనాలు కూలిపోవడంతో పాటు రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది (Venezuela twin earthquakes).

సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి (Caracas buildings collapse). గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, గాయపడిన వారి సంఖ్యపై ఇంకా అధికారిక వివరాలు ప్రకటించలేదు. రెండు భారీ భూకంపాల నేపథ్యంలో వెనెజువెలాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.


నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy