Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీధిలో డీజే.. స్కూల్లో 2వ తరగతి బాలిక గుండెపోటుతో మృతి

వీధిలో డీజే.. స్కూల్లో 2వ తరగతి బాలిక గుండెపోటుతో మృతి

ఇంటర్నెట్ డెస్క్: వీధిలో భారీ డీజే శబ్దంతో నిర్వహించిన ఊరేగింపు కారణంగా స్కూల్లో రెండో తరగతి బాలిక గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో వెలుగు చూసింది.

ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్కూలు పక్క నుంచి పెద్ద శబ్దంతో డీజేతో ఊరేగింపు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఊరేగింపు సమయంలోనే తమ బిడ్డ అనారోగ్యం దిగజారడం ప్రారంభించిందని బాలిక తండ్రి తెలిపారు. ఆమెకు స్వల్ప వ్యవధిలో మూడు సార్లు గుండె పోటు వచ్చినట్టు తెలిపింది. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం, మొదట బాలిక కాస్త అస్వస్థతకు గురైంది. సీటులోంచి కిందకు జారిపోయింది. తల పక్కకు వేలాడేసింది. పక్కనే ఉన్న బాలుడు ఆమె లేపేందుకు ప్రయత్నించాడు. పైకి లేపేందుకు యత్నించాడు. మొదట లేచేందుకు ప్రయత్నించిన బాలిక కాస్త కోలుకున్నట్టే కనిపించింది. ఆ తరువాత మరుక్షణం సీటులోంచి కిందుకు జారిపోయింది. పెద్ద శబ్దంతో డీజే ప్లే చేశారని స్కూల్ నిర్వాహకుడు కూడా తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy