Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీడిని ఏమనాలి.. విదేశీ యువతికి ఎదురెళ్లి.. ఏం చేశాడో చూడండి..

వీడిని ఏమనాలి.. విదేశీ యువతికి ఎదురెళ్లి.. ఏం చేశాడో చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతి పట్ల.. ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇది కేవలం ఒక మహిళకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చే చర్య అని మండిపడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి.. తనకు ఎదురుగా వస్తున్న విదేశీ యువతికి దగ్గరగా వెళ్లాడు. సమీపానికి వెళ్లి ఒక్కసారిగా ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఊహించని పరిణామానికి ఆ యువతి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్లే దేశం మొత్తానికి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఇది దేశ పర్యాటక రంగాన్ని కూడా దెబ్బతీస్తుందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy