Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. సూర్యరశ్మికి తక్కువగా గురికావడం, ఎక్కువసేపు ఇంట్లో లేదా ఆఫీసులో ఉండటం, మారిన జీవనశైలి వంటి కారణాలతో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోంది.

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది కాల్షియంను శరీరం సరిగా గ్రహించేందుకు సహాయపడుతుంది. దీంతో ఎముకలు, పళ్లు బలంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. విటమిన్ డి లోపం ఉంటే అలసట, బలహీనత, తరచూ అనారోగ్యం, మానసిక స్థితి మార్పులు వంటి సమస్యలు రావచ్చు.

ఈ కారణాల వల్ల చాలా మంది విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే వాటిని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, విటమిన్ డి సప్లిమెంట్లను పాలతో తీసుకోవడం మంచిదిగా భావిస్తారు. ఎందుకంటే పాలలో కొవ్వు, కాల్షియం ఉంటాయి. ఇవి విటమిన్ డి శరీరంలో సులభంగా గ్రహించేందుకు సహాయపడతాయి. అయితే పాలు తాగలేని వారు లేదా లాక్టోస్ అలెర్జీ ఉన్నవారు నీటితో కూడా తీసుకోవచ్చు. కానీ అలాంటి సందర్భాల్లో భోజనంలో కొద్దిగా కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాలి.

సరైన సమయం

విటమిన్ డి సప్లిమెంట్లను ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం. ఆ సమయంలో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరం సప్లిమెంట్లను సులభంగా గ్రహిస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు.

అలాగే, ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండడం కూడా సహజంగా విటమిన్ డి పొందేందుకు సహాయపడుతుంది. అయితే, ఎక్కువకాలం సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం స్థాయి పెరిగి కిడ్నీలు, గుండెపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యులని సంప్రదించి సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

/span>

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy