Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివక్ష, దాడులపై దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి: భట్టి విక్రమార్క..

వివక్ష, దాడులపై దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి: భట్టి విక్రమార్క..

న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయినా దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

తమ ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో దళిత-ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు, దళిత-ఆదివాసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అధ్యక్షతన తీర్మానం జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత దేశంలో దళితుల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం వచ్చిందని పేర్కొన్నారు. మనుధర్మ శాస్త్రం పేరుతో వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని.. వారిపై దళితులపై అట్రాసిటీలు ఆగాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటనపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. అంచెలంచెలుగా ఎదిగి సీఎల్పీ నేతగా పని చేశారని, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఖర్గే హాజరైన వేదికను అనంతరం శుద్ధి చేయడం అత్యంత దారుణమని భట్టి విమర్శించారు. బీజేపీ పాలనలో దళితులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారనే భావన కలుగుతోందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రతి ఒక్కరికీ రక్షణ, సమానత్వం దక్కుతుందని భట్టి విక్రమార్క అన్నారు.

అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సమాజానికి వ్యతిరేకంగా మనువాద భావజాలాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే సమావేశం అనంతరం జరిగిన పరిణామాలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోందన్నారు. తెలంగాణలో గతంలో కాంగ్రెస్‌ దళిత నేతలు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్దకు వెళ్లిన సందర్భంలో పసుపు నీళ్లు చల్లిన ఘటనను కూడా అద్దంకి దయాకర్ ప్రస్తావించారు. 'ఢిల్లీలో పెద్ద మోదీ.. గల్లీలో చిన్న మోదీ కేసీఆర్' సనాతన ధర్మం పేరుతో మనువాదాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఖర్గేపై దాడిని రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. కాగా, దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కులు, సమానత్వం కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

'పార్టీ వైఫల్యాన్ని కేసీఆర్‌పై మోపుతున్నావ్‌.. నాతో పెట్టుకోకు'.. కేటీఆర్‌పై కవిత ఫైర్

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కీలక నేతలతో రేవంత్‌రెడ్డి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy