Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు

యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు

విజయవాడ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని వ్యాఖ్యానించారు. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారని కొనియాడారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం..

ప్రధాని మోదీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు... ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశమని చెప్పుకొచ్చారు. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ పెంచేది యోగానే అని వివరించారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్‌దేవ్ బాబా కృషి అమోఘమని ప్రశంసించారు. సాంకేతికత, ఆధ్యాత్మికత కాంబినేషన్‌తో వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ఉద్ఘాటించారు. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో యోగాంధ్ర-2025 నిర్వహించి రికార్డులు సృష్టించామని తెలిపారు. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించామని ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 1.33 లక్షల సెంటర్లల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ప్రజల ఆరోగ్యం బాగుండాలి..

ఇంటింటికీ యోగా చేరాలని... ప్రజల ఆరోగ్యం బాగుండాలని.. ఇదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్వర్ణగ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని అన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. జంక్ ఫుడ్ వద్దని.. ఫాస్ట్‌ఫుడ్‌ను దూరంగా పెడదామని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరిచేరదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని వివరించారు. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. సంజీవనిలో యోగాను చేరుస్తామని చెప్పుకొచ్చారు. రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు పాల్గొని యోగా సాధన చేశారు.

.

అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు

నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy