Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ

రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ

ఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Ponnam Prabhakar) కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు.

మంత్రి పొన్న ప్రభాకర్‌ని ప్రశంసిస్తూ నితిన్ గడ్గరీ ఈరోజు (గురువారం) లేఖ రాశారు. చెక్‌పోస్టుల రద్దు నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.

VAHAN/SARATHI సమీకరణపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను ప్రశంసించారు. రోడ్డు భద్రత చర్యల్లో తెలంగాణ ముందంజలో ఉందని కొనియాడారు. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. ప్రజా అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy