Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big TV Live 3 weeks ago

Weather Updates: మే గడిచిపోయింది.. జూన్ వచ్చేసింది.. అయినా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. రాత్రయితే ఒక్కటే ఉక్కుపోత. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది.

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.

ఆలస్యమైనా చల్లటి కబురు చెప్పిన ఐఎండీ

జూన్ వచ్చేసింది.. దేశంలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. మే చివరి నాటికి రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అది కాస్త జూన్ మొదటి వారానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ నాలుగు లేదా ఐదున రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించడానికి పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపింది.

నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!

నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు ఎంటర్ కావచ్చని అంచనా వేసింది. గతవారం సవరించిన అంచనాలు ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.

తక్కువ వర్షపాతం నమోదవడానికి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణంగా చెబుతోంది. దీనివల్ల దేశంలో రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గుతుందన్నది ఐఎండి మాట. జూన్‌లో ఎల్ నినో పరిస్థితులు బలహీనపడి సెప్టెంబర్‌లో మధ్యస్థం నుంచి బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

సీఎం కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

మరోవైపు దేశంలో ఎండలు మాత్రం మండిపోతున్నాయి. పగలంతా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోతోంది. రుతుపవనాల ఆలస్యంతో ఉత్తర, మధ్య భారతంలో ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live