Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుకున్నదే జరిగింది..కావ్య కొంపముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

అనుకున్నదే జరిగింది..కావ్య కొంపముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

Big TV Live 2 months ago

Pat Cummins, Head To Miss IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( SRH Team) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు, వచ్చే ఐపిఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకునే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ముఖ్యంగా కావ్య పాపకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్ (Travis Head), పాట్ కమ్మిన్స్ ( Pat Cummins ) ఇద్దరు కూడా వచ్చే ఐపీఎల్ 2027 టోర్నమెంటు నుంచి దూరం కాబోతున్నారట. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ( Cricket Australia) కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందుకే వన్డే వరల్డ్ కప్ పైన ఫోకస్ చేయడంలో భాగంగా ఐపీఎల్ 2027 నుంచి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు తప్పుకోబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో కావ్య పాప ( SRH Kavya Maran) టెన్షన్ పడుతున్నారట. ఆ ఇద్దరు క్రికెటర్లు లేకపోతే, ఎలా అంటూ తల పట్టుకుంటున్నారట. ఈ క్రమంలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రిషబ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్నర్ వివాదస్పద పోస్ట్!

కావ్య కొంపముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా చాంపియన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా మళ్లీ టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే తమ క్రికెటర్లను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ పై ఫోకస్ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు దారి చేసిందట. అందుకే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లను పక్కకు పెట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హెడ్ అలాగే పాట్ కమ్మిన్స్ ఇద్దరు కూడా హైదరాబాద్ జట్టుకు దూరమవుతున్నారు. వీళ్ళిద్దరే కాకుండా ఐపిఎల్ ఆడే మిగతా క్రికెటర్లు కూడా టోర్నమెంట్ మొత్తానికి దూరం అవుతారని తెలుస్తోంది. అంటే ఐపిఎల్ 2027 లో ఏ ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్ ఉండబోడు అన్నమాట. దీంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

2023 నుంచి పతనాస్థితిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఏ ఒక్క టోర్నమెంట్ కూడా సరిగ్గా ఆడడం లేదు ప్లేయర్లు. చివరికి బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా ఓడిపోయింది. వన్డేల్లో క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అందరూ భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన క్రికెట్ ఆస్ట్రేలియా, ప్లేయర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారట. అలాగే ఐపీఎల్ టోర్నమెంట్కు కూడా దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారట. ఈ క్రమంలోనే కావ్య పాపకు కొత్త టెన్షన్ మొదలైంది. అయితే హెడ్, కమిన్స్ స్థానంలో మరో ఇద్దరు విదేశీ క్రికెటర్లను వెతికే పనిలో ఇప్పటికే హైదరాబాద్ పడినట్లు తెలుస్తోంది.

PCB Set To Send Pakistan Players To USA: సిక్సర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయర్లపై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live