Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అతడితో జాన్వీకపూర్ పెళ్లి.. స్పందించిన బోనీ కపూర్!

అతడితో జాన్వీకపూర్ పెళ్లి.. స్పందించిన బోనీ కపూర్!

Big TV Live 3 weeks ago

Janhvi Kapoor: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. ప్రేమలో పడిందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్ పహారియా తో ఈమె డేటింగ్ చేస్తోందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. వారు కలసి విహారయాత్రలకు వెళ్లడం, ఆలయ సందర్శనాలు చేయడం, సోషల్ మీడియా పోస్ట్లు అన్నీ చూస్తే నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది .

వ్యాపారవేత్తతో జాన్వీ కపూర్ పెళ్లి..

అందులో భాగంగానే జాన్వీ కపూర్ శిఖర్ పహారియా ఏడడుగులు వేయబోతున్నారు అని.. గుజరాత్ లోని జామ్ నగర్లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్య ఈ వేడుక జరగనుంది అని వార్తలు చెక్కర్లు కొట్టాయి. మరి కొంతమంది జాన్వీ కపూర్ కి తిరుపతి అంటే సెంటిమెంట్. అందుకే తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో సెప్టెంబర్ లో వివాహం చేసుకోబోతోంది అని కూడా ప్రచారం చేశారు. ఇక రోజు రోజుకి ఈమె పెళ్లికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో జాన్వీకపూర్ తండ్రి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ క్లారిటీ ఇచ్చారు.

స్పందించిన జాన్వీ కపూర్ తండ్రి..

ఇక వార్తలు బాగా పాకిపోతున్న నేపథ్యంలో బోనీకపూర్ మాట్లాడుతూ. ” అందులో ఏమాత్రం నిజం లేదు” అంటూ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఒక పాడు కాస్ట్ లో జాన్వీ కపూర్ పాల్గొని..” శిఖర్ తోడు నాకు ఎంతో భద్రతను ఇస్తుంది . నా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా అతని ఉనికి నన్ను ధైర్యంగా మార్చుతుంది. నేను గతంలో లాగా నిస్సహాయంగా ఇప్పుడు ఫీల్ అవ్వడం లేదు.. దీని అంతటికి కారణం శిఖర్”అంటూ జాన్వీ తెలిపింది. పైగా కపూర్ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్లో కూడా శిఖర్ కనిపిస్తూ అందరిలో ఒకరిగా కలిసిపోయారు. అందుకే ఈ వార్తలు జోరు అందుకోవడంతో బోనీకపూర్ స్పందించారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.

బాలయ్య కోసం బాలీవుడ్ భామ.. కొరటాల క్రేజీ థాట్!

జాన్వీ కపూర్ కెరియర్..

ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉంది . టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పాన్ ఇండియా వైడ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఇక 2026 జూన్ లో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక మరొకవైపు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live