Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య కోసం బాలీవుడ్ భామ.. కొరటాల క్రేజీ థాట్!

బాలయ్య కోసం బాలీవుడ్ భామ.. కొరటాల క్రేజీ థాట్!

Big TV Live 3 weeks ago

Balakrishna : నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో వరుస హిట్‌లతో జోరు మీదున్నారు. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన చేయబోతున్న 'NBK 112' ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ వెర్సటైల్ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేయాలనే కొరటాల క్రేజీ ప్లాన్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్లు సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

మళ్లీ సెట్ కానున్న హిట్ కాంబో:

బాలయ్య, విద్యాబాలన్ గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాల్లో జంటగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్-బసవతారకం పాత్రల్లో వారిద్దరి నటనకు, హుందాతనానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత, కొరటాల శివ ఈ హిట్ జోడీని మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఇక విద్యాబాలన్ వంటి నేచురల్ నటి తోడైతే సినిమా స్థాయి జాతీయ స్థాయికి వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

దేవర తర్వాత కొరటాల స్కెచ్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ వంటి భారీ విజయాన్ని అందుకున్న కొరటాల శివ, ఇప్పుడు తన ఫోకస్ అంతా బాలయ్య సినిమాపైనే పెట్టారు. మే 1న ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడమే కాకుండా, మే 9న ఘనంగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బాలయ్య మార్క్ మాస్‌కు, కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌ను జోడించి ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇక కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, సినిమాలో విలన్ లేదా కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ సంజయ్ ఈ ప్రాజెక్ట్‌లో చేరితే, బాలయ్యతో ఆయన తలపడే సీన్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని సమాచారం.

అది నా "హ్యాపీ ప్లేస్".. త్రిష పోస్ట్ వైరల్!

బాలయ్య వరుస సినిమాల జోరు:

గత ఏడాది డాకు మహారాజ్, అఖండ 2: తాండవం వంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన బాలయ్య, ఇప్పుడు తన 112వ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక పక్క గోపీచంద్ మలినేని సినిమా పనుల్లో ఉంటూనే, కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించారు. ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.

బాలయ్య – కొరటాల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. దానికి విద్యాబాలన్, సంజయ్ దత్ వంటి తారలు తోడైతే ఇక ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. ఇక కొరటాల శివ ఈ సినిమాతో బాలయ్యకు ఎలాంటి పవర్‌ఫుల్ హిట్ ఇస్తారో చూడాలని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live