Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS : తమిళనాడు ఫలితాలే తెలంగాణలో రిపీట్!

BRS : తమిళనాడు ఫలితాలే తెలంగాణలో రిపీట్!

Big TV Live 3 weeks ago

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ నడుస్తున్నాయి.ఎన్నికల పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి.

తమిళనాడులో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా అధికార డీఎంకే పార్టీ వెనుకబడింది.ఎగ్జిట్ పోల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన టీవీకే(తమిళ వెట్రి కజకం) పార్టీ అధికార డీఎంకే, ప్రతిపక్షఅన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నట్టి టాప్‌లో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఆ పార్టీ వందకు పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.మెజార్టీ మార్క్‌కు మరో 10 స్థానాలు వెనకబడి ఉన్నది విజయ్ పార్టీ.అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కావడంతో అధికార డీఎంకే ప్రస్తుతం తల పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఐదేండ్ల పాలనలో అధికార డీఎంకే మీద పెద్దగా వ్యతిరేకత కనిపించలేదని.. ఈసారి కూడా ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు.కానీ, ఫలితాలు రివర్స్ అయ్యేసరికి పొరపాటు ఎక్కడ జరిగిందని అంతా లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రెండోసారి కలిసివచ్చేనా?

తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన పాలన అందించారు. కానీ,కాలం గడుస్తున్న కొద్దీ ఆ పార్టీపై విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.మరోసారి అధికారంలోకి వస్తామని స్టాలిన్ ధీమాగా ఉన్నారు.ఇప్పుడు ఫలితాలను చూసి ఆయన షాక్‌లో ఉన్నట్టు తెలిసింది.ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వచ్చే టర్ములోనూ తామే అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే గుర్తుచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నదని..అంతకుముందు వైఎస్సార్ హయాంలోనూ కాంగ్రెస్ పదేండ్లు ప్రభుత్వాన్ని నడపిందని.. అందుకే తాను మరోసారి సీఎం అవుతానని సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత మరిచారా?

ప్రజా వ్యతిరేకత ఏరూపంలోనైనా రావచ్చు. ప్రభుత్వ పాలన, సంక్షేమం అమలులో నిర్లక్ష్యం, నేతల అవినీతి అక్రమాలు, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వీటన్నింటిని ప్రజలు నిత్యం గమనిస్తూ ఉంటారు. ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించే పార్టీలు.. అధికారంలోకి రాగానే వాటి అమలులో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి..కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం తమకు ఏదో చేస్తుందని జనాలు ఎదురుచూస్తుంటారు. ఇచ్చిన హామీలు అమలులో ఆలస్యం కనిపిస్తే చాలు ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై క్షేుత్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పదే పదే గుర్తుచేస్తున్నది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అములు కాలేదని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. తెలంగాణలోనూ ఎగిరేది కమలమే, రామచంద్రరావు ధీమా వ్యక్తం

ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఆరు గ్యారంటీల అమలు, తులం బంగారం, మహిళలకు రూ.2500, హైడ్రా యాక్షన్ వంటి నిర్ణయాలతో రేవంత్ సర్కారుపై కాస్త వ్యతిరేకత పెరిగింది. ఇదే విషయాన్ని అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం పదే పదే గుర్తుచేస్తున్నది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీ నిలదీస్తున్నది. ప్రతిసామాన్యుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నిరుద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు.విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి నిలదీస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారని మాజీ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కమీషన్లు,రౌడీ రాజ్యం నడుస్తోందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని.. బీఆర్ఎస్‌ అధికారంలోకి పక్కా అని స్పష్టంచేస్తున్నారు ఆ పార్టీనేతలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live