Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరణ్  వర్సెస్ వరుణ్ ..  బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కాబోతున్నాయా?

చరణ్ వర్సెస్ వరుణ్ .. బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కాబోతున్నాయా?

Big TV Live 2 weeks ago

Charan vs varun :'పెద్ది'…ఎన్నో సార్లు వాయిదాల పాట పాడిన ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా ఎట్టకేలకి జూన్ 4 న రిలీజ్ కాబోతున్న సంగతి తెల్సిందే.అయితే సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో, అంతకు మించిన నెగెటివ్ టాక్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

హిందీ మార్కెట్.. చరణ్‌కు సవాల్‌ ?

రామ్ చరణ్‌కు ‘RRR’తో గ్లోబల్ వైడ్ ఇమేజ్ వచ్చింది నిజమే. కానీ, ఒక స్ట్రెయిట్ సబ్జెక్టుతో హిందీ ఆడియన్స్‌ను మెప్పించడం అంత సులభం కాదు కూడా . ‘పెద్ది’ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అని చెబుతున్నారు. అయితే, నార్త్ ఆడియన్స్ ఇలాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలను ఇపుడు ఎంతవరకు ఆదరిస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.అంతేకాకుండా ఈ సినిమా చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి పాన్ ఇండియా స్థాయిలో అసలైన పరిక్షనే పెట్టబోతుంది.కారణం బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ ఫిలిమ్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై ‘పెద్ది’ విడుదలైన నెక్స్ట్ డే నే అంటే జూన్ 5నే థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వడమే.

హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండటంతో నార్త్‌లో థియేటర్లు దొరికే విషయంలో ,షోల టైమింగ్స్ విషయంలో ‘పెద్ది’కి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. జియో స్టూడియోస్ వెనకున్నా, లోకల్ స్టార్ సినిమా ముందు మన సౌత్ కంటెంట్ నిలబడాలంటే టాక్ ‘ఎక్స్‌ట్రార్డినరీ’గా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా హిందీ మార్కెట్ నుంచి ఆశించిన వసూళ్లు రావడం కష్టమే!

also read :నితిన్-సితార 'క్రేజీ' కాంబో షురూ.. ఈసారైనా లక్ మారుతుందా?

హిందీ ప్రేక్షకులకు ఓవర్ డ్రామా

సాధారణంగా సౌత్ నుంచి వెళ్లే రూరల్ బ్యాక్‌డ్రాప్ కథలు నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడం చాలా కష్టం.బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా మరియు ‘రా అండ్ రస్టిక్’ మేకింగ్ హిందీ ప్రేక్షకులకు ‘ఓవర్ డ్రామా’గా అనిపించే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతోంది. దీనికి తోడు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఫ్యాక్టర్ కూడా ఏమేరకి కలిసి వస్తుందో చూడాలి.. ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా ఆమెకు సరైన సోలో కమర్షియల్ హిట్ లేకపోవడం ‘పెద్ది’ బిజినెస్‌పై ఇంపాక్ట్ పడుతుందన్న టాక్ వినిపిస్తుంది.కేవలం గ్లామర్ కోసమే తప్ప, వసూళ్ల పరంగా జాన్వీ ఎంతవరకు ప్లస్ అవుతుందనేది రిలీజ్ రోజే తేలిపోవాలి.

‘పెద్ది’ నలిగిపోయే ఛాన్స్

మరో వైపు సినిమా బిజినెస్ లెక్కలు కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయి. రికార్డు స్థాయి రేట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైతే మాత్రం , సినిమా కచ్చితంగా ‘బ్లాక్ బస్టర్’ టాక్ తెచ్చుకోవాల్సిందే. ఏమాత్రం యావరేజ్ టాక్ వచ్చినా, భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవడం చాలా కష్టం.అటు వరుణ్ ధావన్ సినిమా పోటీ, ఇటు నార్త్ ఆడియన్స్ టేస్ట్.. ఈ రెండింటి మధ్య ‘పెద్ది’ నలిగిపోయే ఛాన్స్ కనిపిస్తుందని ఇప్పటికే హింట్స్ ఇస్తున్నారు ట్రేడ్ పండిట్స్.కేవలం తెలుగు రాష్ట్రాలలో వచ్చే కలెక్షన్స్ పై డిపెండ్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్‌గా చరణ్ క్రేజ్ రిస్క్‌లో పడ్డట్టే.మొత్తానికి పెద్ది కి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ తో నార్త్ లో గట్టి పోటీ ఎదురు అయ్యేలానే కనిపిస్తుంది.చూడాలి మరి బాలీవుడ్ బాబుల డామినేషన్ ని తట్టుకొని మన పెద్ది ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live