Dailyhunt
గడ్డి యంత్రంలో చిక్కుకుని కూలీ మృతి..!

గడ్డి యంత్రంలో చిక్కుకుని కూలీ మృతి..!

Big TV Live 5 days ago

Worker Accident: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్ రెడ్డి (51) గడ్డి కట్టలు కట్టే రోలర్ యంత్రం వద్ద కూలి పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

రోజువారీ ఉపాధి కోసం పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన యంత్రంలో చిక్కుకుపోయారు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి యంత్రాన్ని ఆపి బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిసింది.

పోలీస్ స్టేషన్ లో 'ఏందయ్య సామీ'.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రమాదానికి గల కారణాలు..

ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సంపత్ రెడ్డి మృతి కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది. మృతునికి భార్యతో పాటు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కదిలించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. అనుకోని ప్రమాదంలో కుటుంబ పోషకుడిని కోల్పోయిన ఈ కుటుంబం పరిస్థితి చూసి గ్రామస్తులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live