No Invitation For David Warner over Kavya Maran Wedding Reception: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి పది రోజుల కిందట గ్రీస్ లో జరగగా..
శనివారం రోజున సాయంత్రం చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో రిసెప్షన్ (Kavya Maran Wedding Reception) ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో క్రీడా ప్రముఖులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఎంకే స్టాలిన్, రజనీకాంత్, రాధిక, లారెన్స్, భువనేశ్వర్ కుమార్, డేల్ స్టెయిన్, కేన్ మామ లాంటి మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు.
కావ్య మారన్ రిసెప్షన్.. అలిగిన డేవిడ్ వార్నర్
కావ్య పాప రిసెప్షన్ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రిసెప్షన్ వేడుకకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో పాటు మాజీలు కూడా రావడంపై డేవిడ్ వార్నర్ అలిగినట్టు సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. 2016లో టైటిల్ అందించిన తనను కావ్య పాప పట్టించుకోలేదని ఎమషనల్ అవుతున్నట్లు సెటైర్లు పేల్చుతున్నారు. రిసెప్షన్ కు అందరినీ పిలిచి, టైటిల్ అందించిన తనను మాత్రం ఒంటరి చేయడం కరెక్ట్ కాదని డేవిడ్ వార్నర్ బాధపడుతున్నట్టు మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా డేవిడ్ వార్నర్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ కు ఉన్న అనుబంధం ఏంటి?
సన్ రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్… 2015లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక 2016 ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును తొలిసారిగా ఛాంపియన్ గా నిలిపాడు. 2015, 2017, 2019 సీజన్స్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆరెంజ్ క్యాప్ లు అందుకున్నాడు. కానీ 2021 తర్వాత అతన్ని కావ్య పాప వదిలేసింది. ఈ తరుణంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్లిన వార్నర్.. ఆ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వెళ్లిన తర్వాత కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రస్తావిస్తూ, డేవిడ్ వార్నర్ పోస్టులు పెట్టాడు. ఈ తరుణంలోనే అతన్ని ఇన్ స్టా గ్రామ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బ్లాక్ చేసింది. దీంతో అతనితో బంధం పూర్తిగా తెగిపోయింది.

