Gundeninda Gudigantalu Nithu : ప్రముఖ తెలుగు ఛానెల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. మధ్యతరగతి కుటుంబంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ వస్తుంది. మెయిన్ లీడ్ లో నటించిన బాలు మీనాల క్యారెక్టర్లు హైలెట్గా నిలుస్తున్నాయి.. అయితే ఈ సీరియల్ లో ఈ మధ్య కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అందులో నీతూ ఒకరు. రవి శృతిల మధ్య చిచ్చుపెట్టే క్యారెక్టర్ లాగా నీతూ ఎంట్రీ ఇచ్చింది.. ఆమె గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆత్రుత కనబరుస్తున్నారు.. మరి ఈమె పర్సనల్ లైఫ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
నీతు రియల్ లైఫ్..
స్టార్ మా చానల్లో పాజిటివ్ రెస్పాన్స్ని అందుకుంటూ వస్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కొత్తగా నీతు అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సత్యం ప్రభావతిలో మూడవ కొడుకు లేచిపోయినోడు పాత్రలో నటిస్తున్న రవి పని చేస్తున్న రెస్టారెంట్ ఓనర్ కూతురుగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. హైపర్ యాక్టివ్ గా ఉండే అమ్మాయిగా అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఈమె గతంలో సత్యభామ అనే సీరియల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు.. నీతు అసలు పేరు యామిని. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆమె జన్మించింది. చదువుతో కూడా అక్కడే పూర్తి చేస్తుంది. నటనపై ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అలా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సీరియల్స్ తో బిజీగా గడుతుంది.. గతంలో స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ సత్యభామలో హీరో చెల్లెలు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేసుకుంది.. ఇప్పుడు ఈ సీరియల్ లో కూడా నటించి యువతను మెప్పిస్తుంది..
Also Read :'బ్రహ్మముడి' అప్పుకు కాబోయే భర్త బ్యాగ్రౌండ్ ఏంటంటే..?
నీతూ ఒకరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఈమె మోడల్ గా కెరియర్ని ప్రారంభించి వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది. పెళ్లయిన కొత్తలో ఇట్లు నీ బావ, నా పేరు యామిని, హౌస్ వైఫ్ వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ తో బుల్లితెరపై అడుగు పెట్టింది. ఆ తర్వాత రంగులరాట్నం, కన్యాదానం, శుభస్ర శ్రీగ్రం వంటి సీరియల్ సెలవు నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో నటించింది. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ వస్తుంది. ఈ సీరియల్ గాను ఈమె ఒక రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 30 వేలు తీసుకుంటుందని సమాచారం.. ఈ లెక్కన చూస్తే ఈమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

