Ilaiyaraaja Journey: భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న 'మాస్ట్రో' ఇళయరాజా తన 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'అన్నకిలి' చిత్రంతో మొదలైన తన ప్రస్థానం నేటికి అరవై దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.
Read also-బుచ్చిబాబును కారులో రైడ్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. 'పెద్ది' ట్రైలర్‌పై మరింత క్లారిటీ..
ప్రేక్షకుల ప్రేమే నా బలం
అభిమానులు తనను 'సంగీత దేవుడు' అని పిలవడంపై స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ నా పనిని దైవంగా భావించి నిజాయితీగా చేశాను. ప్రజలు నాలో దైవత్వాన్ని చూస్తున్నారంటే, అది నా సంగీతం వారి మనసులకు ఇస్తున్న ప్రశాంతతకు నిదర్శనం. వారు నన్ను అలా గౌరవించడం నాకు గర్వంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.
టేబుల్‌పై మొదలైన ప్రయాణం..
తొలి చిత్రం 'అన్నకిలి' (1976) అవకాశాన్ని గుర్తుచేసుకుంటూ.. నిర్మాత పంచూ అరుణాచలం తనను కలిసినప్పుడు తన వద్ద ఎలాంటి వాయిద్యాలు లేవని, కేవలం టేబుల్‌పై చేతులతో తడుతూ ఆయనకు ట్యూన్లు వినిపించానని ఇళయరాజా వెల్లడించారు. ఆ రాగాలకు ముగ్ధుడైన అరుణాచలం, ఆ పాటల ఆధారంగానే సినిమా కథను అల్లుకోవడం విశేషం.
Read also-హాలీవుడ్ లోకి నిఖిల్.. తెలుగు సినిమాలకు గుడ్ బై..?
భయం నుండి..
కెరీర్ ఆరంభంలో తన పరిస్థితి గురించి చెబుతూ.. “మొదటిసారి ఒంటరిగా సంగీత బాధ్యతలు చేపట్టినప్పుడు అడవిలో దారితప్పిన వాడిలా భయం వేసింది. కానీ, సంగీతమే నన్ను నడిపించింది. నేడు టెక్నాలజీ ఎంత మారినా, సంగీతంలోని ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను రేపు లేకపోయినా నా సంగీతం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఇళయరాజా, నేటికీ అదే ఉత్సాహంతో నూతన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.\

