Kakinada Accident: ఆధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హమీ పనుల కోసం కూలీలందరు కలిసి రోడ్డు దాటుతుండగా ఓ టిప్పర్ సడన్ గా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో అక్కడిక్కడే నలుగురు కూలీలు మరిణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలతో వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. భాదితులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరణిచిన వారు చీడిగ గ్రామానికి చెందిన సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం గా గుర్తించారు.
Also read: సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో.. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
స్పందించిన మంత్రి నారాలోకేష్..
కాకినాడలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారాలోకేష్ స్పందించారు. కొవ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగు ఉపధి హమీ కూలీలు మరణించడం దుర్మరణం పాలవడం కలిచి వేసిందని అన్నారు. ఉపాధి పనులకు వెళ్లూ మరణించడం భాదాకరం అని అన్నారు. ప్రామాదంకి గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం తక్షణమే అందించాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంభాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు.

