Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.కొనుగోలులో జాప్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో కొనుగోలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, ముఖ్యంగా సన్న రకం ధాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,నిబంధనల పేరుతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.
సీఏం నిర్తక్ష్యం..
కమిషన్లకు కక్కుర్తి పడి రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుంటే,ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏంఎస్పి పెంచిన కూడా అధికారులు ,రైస్ మిల్లర్లు ,కమిషన్ ఏజెంట్లు ,దళారులు కుమ్మకై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు, తక్కువ ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చూస్తున్నారు. రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలో సహకరించకపోవడంతో కేసులు పెట్టండి అని ప్రభుత్వానికి సూచించారు. తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వైఖరి విడిచిపెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. హామీల కొరత,గన్ని బ్యాగుల కొరతను నివారించి తూకం పక్రియను వేగవంతం చేయాలని కోరారు.
Also read: సంతాన ప్రాప్తిరస్తు..! ఎంతమందిని కంటే అంత ప్రోత్సాహం.. బాబు ఏం చేసినా అంతే.. ! ట్రెండ్ సెట్టర్..
వివిధ నాయకులు..
రైతులతో రాజకీయం చేసి గత ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందనీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం తగదని సూచించారు.కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్,కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మెహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ నాయకులు పాల్గోన్నారు.

